ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన- ఓట్ల కోసం హడావుడిగా ఆర్వోప్లాంట్‌ ఏర్పాటు! - YSRCP Violate Election Code - YSRCP VIOLATE ELECTION CODE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 12:12 PM IST

YSRCP Leaders Violate Election Code: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ నేతలు కుటిలయత్నాలకు తెర లేపుతున్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం అయ్యన్న కోటలో హడావిడిగా ఆర్వోప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశంలోకి చేరాయి. 

మరికొంత మంది వైఎస్సార్సీపీని వీడే అవకాశమున్నట్లు గుర్తించిన నేతలు మిగిలిన వారి ఓట్లను అయినా దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులపైన ప్రేమను ఒలకబోస్తూ హడావుడిగా శుద్ధజల ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. ఐదేళ్లుగా గ్రామం వైపు కన్నెత్తి చూడని వైఎస్సార్సీపీ నేతలు ఉన్నపళంగా ఇంత ప్రేమను ఒలకబోయటం ఏంటని స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details