ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ గుర్తుకే ఓటు వేస్తాం- నేతల బరితెగింపు! దేవుడి మీద ప్రమాణాలు చేయిస్తున్న వైనం - YSRCP Taking Oath from Voters - YSRCP TAKING OATH FROM VOTERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 6:14 PM IST

YSRCP Leaders Taking Oath Infront of God with Voters: రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైఎస్సార్సీపీ నేతల్లో ఓటమి భయం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు నానాప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను రకరకాలుగా ప్రలోభ పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. చివరకు దేవుడిని కూడా వదలకుండా ఓట్ల కోసం వాడుకుంటున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని గెలిచేందుకు వైఎస్సార్సీపీ నేతలు చేసిన ప్రయత్నాలు తిరుపతిలో వెలుగు చూశాయి. నగరంలోని కోర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో ఫ్యాన్‍ గుర్తుకే ఓటేస్తామంటూ స్ధానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు దగ్గరుండి ఓటర్లతో ప్రమాణం చేయించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటంతో పాటు ప్రమాణాలు చేయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details