ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

షెడ్యూల్​కు ముందే వైసీపీ తాయిలాల పర్వం - ఆసరా సభలో చీరలు పంపిణీ - ఒంగోల్లో వైఎస్సార్సీపీ తాయిలాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 5:36 PM IST

YSRCP Leaders Sarees Distribution in Padarthi Village: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆసరా సంబరాల సభలో మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas reddy) ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ మహిళలు, వాలంటీర్లకు అధికార పార్టీ నాయకులు తాయిలాలు పంపిణీ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

స్వయం సహాయక సంఘాలకు చెందిన సుమారు 600 మంది మహిళలకు వైఎస్సార్‌ ఆసరా (YSR Aasara) సంబరాల్లో భాగంగా స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు చీరలు పంపిణీ చేశారు. ఈ మేరకు గ్రామంలో స్వయం సంఘాలకు చెందిన మహిళలకు చీరలు, గ్రామ వాలంటీర్లకు హాట్‌ బాక్స్‌లు, టీ కప్పుల సెట్లను వైఎస్సార్సీపీ నేతలు బహుమతులుగా పంపిణీ (Gifts distribute)  చేశారు.

ABOUT THE AUTHOR

...view details