ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇళ్ల పేరుతో దోపిడీ - పేదల డబ్బులు మింగేసిన వైఎస్సార్సీపీ నాయకులు - YSRCP Leaders Looted Money - YSRCP LEADERS LOOTED MONEY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 1:14 PM IST

YSRCP Leaders Looted Money in The Name of Houses to Poor People in Eluru District :  ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో పేదల ఇళ్ల పేరిట వైఎస్సార్సీపీ నాయకులు డబ్బులు మింగేశారు. గ్రామంలో 227 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారిలో సగం మంది కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. స్థానిక వైఎస్సార్సీపీ నేత అనుచరుడు ఇల్లు కట్టుకోకపోయినా లక్షన్నర రూపాయలు బ్యాంకులో జమ చేశారు. మరో నాయకుడి అన్న కుమారుడికి ఇలాగే 35 వేలు డబ్బులు పడింది. దశాబ్దాల క్రితం కట్టిన ఇళ్లకు కూడా బిల్లులు పెట్టుకుని దోచుకున్నారు. ఇళ్లు కట్టుకున్న కొందరు లబ్ధిదారులకు సగం డబ్బులిచ్చి, మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నాయకులు స్వాహా చేశారు.  
పీఎం ఆవాస్ యోజన సొమ్ము భారీగా నొక్కేసిన నాయకుల బాగోతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. నిర్మాణానికి ఇచ్చే ఇసుక, ఇనుము, సిమెంట్ పక్కదారి పట్టించారు. నిర్మాణ బిల్లులు జేబులో వేసుకోవటం వంటి అక్రమాలన్నో విస్తుగొలుపుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details