రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - ఈనాడు పాత్రికేయుడిపై దాడి - YSRCP Attack Eenadu Journalist - YSRCP ATTACK EENADU JOURNALIST
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 7:52 AM IST
YSRCP Leaders Attack on Eenadu Journalist in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈనాడు కంట్రిబ్యూటర్ రమేష్‌పై వైఎస్సార్సీపీ రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. జగన్ రోడ్ షో కవరేజీకి వెళ్లి తిరిగి వస్తుండగా మద్యం తాగిన పది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు రమేష్ పై దాడి చేశారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించడంతో రమేష్ గాయపడ్డారు. గాయపడిన రమేష్‌ను తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి, తరవాత అనంతపురం పావని ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ అరాచకాలు బయట పెడుతున్నామన్న అక్కసుతో దాడికి పాల్పడుతున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఘటనలో తల్లీ, కుమారుడిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. మద్యం తాగి ద్విచక్ర వాహనంతో తమ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టడమే గాక దుర్భాషలాడుతూ దాడికి దిగారని బాధితులు వాపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పరామర్శించారు. సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.