గీతాశ్రమానికి ఫెన్సింగ్ - భూమిని ఆక్రమించి అరాచకాలు- ఆగని వైఎస్సార్సీపీ భూదోపిడీలు - YSRCP Land Encroachment - YSRCP LAND ENCROACHMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 5:20 PM IST
YSRCP Land Encroachment, Fencing to Geetashram in Pattiseema : వైఎస్సార్సీపీ రాక్షస పాలన అంతమైనా భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఏలూరు జిల్లా పట్టిసీమలో గీతాశ్రమానికి ఫెన్సింగ్ వేసి భూమిని ఆక్రమించారు. 15 రోజుల పాటు తమను గృహ నిర్భంధం చేశారని, ఆశ్రమ నిర్వాహకురాలు స్వరాజ్యలక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వృద్ధురాలు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని స్వరాజ్యలక్ష్మీ కోరుతున్నారు.
ఆహారం, మందులు పానీయాలు తెచ్చుకోవడానికి, సహాయం అందించే వారు రాకపోకలు సాగించడానికి మార్గం లేక 15 రోజులుగా అవస్థలు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఇటీవల ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం పిచ్చి మొక్కలను తప్పించుకుంటూ కాలిబాట ద్వారా వెళ్లి అందించడం గమనార్హం. స్థానిక అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని స్వరాజ్యలక్ష్మి కోరుతున్నారు.