ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం చేస్తాం: టీడీపీ - ప్రజల కోసం ప్రజల వెంట జెండా ధ్యేయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 5:12 PM IST
YSRCP Government Obstacles to Jenda Public Meeting: టీడీపీ-జనసేన (TDP-Janasena Meeting) కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్న కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభకు కార్యకర్తలను రానివ్వకుండా రవాణా సౌకర్యంలో సీఎం జగన్ అడ్డంకులను సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభను విజయవంతం చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కచ్చితంగా మార్పు తథ్యం అని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు 99 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన తరువాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభకు 'జెండా' (Jenda) అనే పేరును ఖరారు చేశారు. ఈ సభకు 5 లక్షల మందికి పైగా శ్రేణులు తరలి వస్తారని నేతలు అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధం అవ్వటం వల్ల టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయవలసిన కార్యక్రమాలపై ప్రసంగించనున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ప్రజల కోసం ప్రజల వెంట ఉంటామని నేతలు తెలిపారు.