ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ముస్తాబాదలో ఉద్రిక్తత - బాహాబాహికి దిగిన టీడీపీ-వైఎస్సార్సీపీ కార్యకర్తలు - YSRCP TDP Mutual Attacks - YSRCP TDP MUTUAL ATTACKS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 3:07 PM IST

YSRCP - TDP Mutual Attacks in Krishna : కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు చెప్పుల, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు ఎదురెదురు పడడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్ళతో కొట్టుకున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న డీఎస్పీ జయసూర్య ఇరు వర్గాలకు నచ్చజెప్పి వారిని పంపించేశారు. యార్లగడ్డ వెంకట్రావ్​ను పురుషోత్తపట్నం వైపు సావరగూడెం వైపునకు వంశీ వర్గాలను పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల  ఉద్రిక్త వాతావరణం నడుమ ఎన్నికలు సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఆగడాల వల్ల పోలింగ్​ బూత్​లు రణరంగంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో బూత్​ ఆఫీసర్లపై సైతం దాడులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details