ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగనన్న ఆసరాలో మహిళల అవస్థలు- భోజనం లేక ఇక్కట్లు - బుట్టాయిగూడెంలో వైఎస్సార్‌ ఆసరా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 9:49 AM IST

YSR Asara For Not Food in Women at Buttaigudem: జగనన్న వైఎస్సార్ ఆసరాలో మహిళలకు భోజనాలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండలంలోని 888 మహిళా సంఘాలకు వైఎస్సార్ ఆసరా ద్వారా 4కోట్ల 48లక్షల నమూనా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో 4వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

4వేల మంది మహిళలు పాల్గొంటే 2వేల మందికి మాత్రమే అధికారులు భోజనాలు ఏర్పాటు చేశారు. దీనితో మధ్యాహ్న భోజన ప్యాకెట్ల పంపిణీ సమయంలో మహిళల మధ్య తోపులాట జరిగింది. మధ్యాహ్న భోజనాలు లేక మహిళలు ఆకలితో అల్లాడారు. భోజనాల కోసం మహిళల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు సరైన భోజన వసతులు కూడా ఏర్పాటు చేయలేదని మహిళా సాధికారత అంటే ఇదేనా జగనన్నా అని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల ప్రభుత్వమని చెప్పుకునే జగన్ తన ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలరాజు తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details