ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హత్యకేసులో నిందితుడిని గెలిపిస్తే ప్రజాస్వామ్యం ఉంటుందా? : వైయస్‌ సునీత - ys sunitha election campaign - YS SUNITHA ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:30 PM IST

YS Sunitha Election Campaign in kadapa District : వైఎస్సార్సీపీ పాలనలో దోపిడి రాజ్యం నడుస్తోందని వైయస్‌ సునీత ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సొంతంగా ఆలోచించాలన్నా భయం వేస్తోందని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని అనిమల, ఊరుటూరులో  కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మనందరికి సుపరిచితుడు అయిన వివేకానంద రెడ్డిని ఎంత దారుణంగా చంపారో అందరికి తెలుసన్నారు. నాన్నని దారుణంగా హత్యచేసి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి న్యాయం జరగలేదని వాపోయారు. 

కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ అసలు మీకు అందుబాటులో ఉన్నాడా? అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హాత్యకేసులో నిందితుడిగా ఉన్న అలాంటి వారిని ఓట్లు వేసి గెలిపిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా? అని మండిపడ్డారు. ఎల్లప్పుడు ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే వివేకానంద రెడ్డిని అన్యాయంగా చంపేశారు. అటువంటి వ్యక్తికి న్యాయం చేసే అవకాశం వచ్చింది. కాబట్టి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించాలని ఓటర్లకు సునీత విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details