ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇంటి స్థలం కబ్జా చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ - యువకుడు ఆత్మహత్యాయత్నం - ఇంటి స్థలం ఆక్రమించిన కానిస్టేబుల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 9:00 PM IST

Young Man Suicide Attempt at Narsaraopet Collectorate: ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాన్ని హెడ్‌ కానిస్టేబుల్‌ కబ్జా చేశారంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్‌ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు డబ్బాతో వచ్చిన శివకృష్ణను పోలీసులు గమనించి అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రొంపిచర్ల గ్రామంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్థలాన్ని ప్రస్తుతం చిలకలూరిపేటలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న ఉయ్యాల రమేష్‌, అతని బంధువులు ఆక్రమించుకున్నారని బాధితుడు ఆవేదన చెందాడు. కట్టుకున్న ఇంటిని కూల్చారని బాధితుడు వాపోయాడు. 

ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎన్ని కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన చెందాడు. తనపై అక్రమ కేసులు శివకృష్ణ పెడతానని బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు వెంటనే న్యాయం చేయాలని శివకృష్ణ వేడుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details