ఉద్యోగం వద్దనుకుని పొలం బాట పట్టాడు - లాభాలు గడిస్తున్నాడు - YOUNG FARMER EARNING MORE - YOUNG FARMER EARNING MORE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 12:17 PM IST
Young Farmer Earning More Than Software Employees With Farming in Anakapalli district : పేద కుటుంబం. మంచి చదువు. మంచి ఉద్యోగం. సంపాదించే సామర్థ్యం. అయినప్పటికీ వ్యవసాయాన్నే ఎంచుకున్నాడా యువకుడు. 'పెద్ద చదువులు చదివావు.. మంచి ఉద్యోగం చూసుకో, వ్యవసాయం చేస్తే మాలాగే నష్టపోతావు' అని తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు ఆ యువకుడు. సాగులో మెళకువలు నేర్చుకుని ఆధునిక పద్ధతులు అనుసరించాడు. తనకున్న 4 ఎకరాల్లోనే కూరగాయల సాగు చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సమానంగా సంపాదిస్తున్నాడు. సాగుతో లాభాలు పండిస్తున్న యువరైతు చలమనాయుడు. డిగ్రీ చదివి వ్యవసాయం బాట పట్టాడు. బీర, కాకర, ఆగాకర, బొప్పాయి తదితర పంటలు సాగు చేస్తూ సొంతూళ్లోనే ఉంటూ ఏటా లక్షలార్జిస్తున్నాడు. నలుగురికి ఉపాధి కల్పిస్తూ, ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు తెలుసుకుంటున్నాడు. పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులను వదిలి ఎక్కడో ఉంటూ ఉరుకుల పరుగుల ఉపాధి కంటే తనకు వ్యవసాయం చేయడమే ఇష్టమంటున్న అనకాపల్లి జిల్లాకు చెందిన యువరైతు చలమనాయుడుతో ముఖాముఖి.