ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నందిగామలో టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తీవ్రగాయాలు - MLA Followers Attack TDP activists

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 3:16 PM IST

YCP MLA Followers Attacked on TDP Activists in Nandigama: రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డు, అదుపులేకుండా పోయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం కార్యకర్త నల్లారి కిశోర్, అతని సోదరుడు నరసింహరావుపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు అనుచరులు దాడి చేశారు. 12వ వార్డులో ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతు తెలిపే వారికి ఓట్లు ఎలా వేస్తారని తెలుగుదేశం కార్యకర్తలు ప్రశ్నించడంతో ముందుగానే అక్కడికి చేరుకున్న 15 మంది ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహంతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కిశోర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. 

ఎన్నికల ప్రచారంలో రాజధాని విషయంపై తమకు ఎమ్మెల్యే మధ్య సంభాషణ జరిగింది. ఎమ్మెల్యే మూడు రాజధానుల కోసం పాదయాత్ర చేయడం ఎన్నికల మీద దాని ప్రభావం చూపుతుంది. మేము టీడీపీ కార్యకర్తలని ఎమ్మెల్యే తన అనుచరులను పిలిపించి తమపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు రౌడీ ముకలను వెంట పెట్టుకొని వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేద్దామనుకుంటే అది జరగదు. ఈ దాడిపై ఎన్నికల్లో ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారు. -నల్లారి కిశోర్‌, బాధితుడు

ABOUT THE AUTHOR

...view details