వైఎస్సార్సీపీకి పలువురు నాయకులు గుడ్ బై - టీడీపీలోకి భారీగా చేరికలు - YCP Leaders Joined in TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 12:16 PM IST
YCP Leaders Joined in TDP at NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చందర్లపాడు మండలాల్లోని వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ టీడీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో వారంతా టీడీపీలోకి చేరారు. చందర్లపాడు మండలంలోని సౌమ్య ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్ రాక్షస పాలనకు భయపడి వైసీపీను వీడి నాయకులందరూ టీడీపీలో చేరుతున్నారని కేశినేని శివనాథ్ అన్నారు.
TDP Scarf Covered in YCP leaders: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సౌమ్య సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో నియోజకవర్గంలోని కార్యకర్తలంతా ఈ నలభై రోజులు కష్టపడి పని చేయాలని ఆమె కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను అణచి వేస్తూ నియంత పాలన సాగిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీలో చేరిన వైసీపీ నేతలకు శివనాథ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.