ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల్లో గెలిచేెందుకు వైసీపీ నేతలు అడ్డదారులు - వాలంటీర్లకు తాయిలాలు - వైసీపీనేతలు వాలంటీర్లకు డబ్బుపంపిణీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 10:43 PM IST

YSRCP Leaders Distributing Money To Volunteers: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నేతలు వాలంటీర్లకు తాయిలాలు పంచుతున్న దృశ్యాలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకున్నాయి. తాజాగా మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వాలంటీర్లందరూ హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. తర్లుపాడు, మార్కాపురం మండలాలకు చెందిన 450 మంది వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. 

సమావేశానికి హాజరైన అందరికీ రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య ఒక్కో వాలంటీర్​కు రూ.5 వేల నగదు, ఒక స్వీట్ బాక్స్ పంపిణీ చేసి ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. రోజుకి ఒక మండలం వారీగా నియోజకవర్గంలోని మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల నాలుగు మండలాల్లో వాలంటీర్ల అందరికీ డబ్బులు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లందరూ ఇంటింటికీ తిరిగి తమ గెలుపు కోసం కృషి చేయాలని వైసీపీ నేతలు సూచించారు. వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేయడంపై గెలుపు కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.   

ABOUT THE AUTHOR

...view details