ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు - నామినేషన్ వేసేందుకు వెళ్తూ - Election Code violation - ELECTION CODE VIOLATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 3:48 PM IST
YCP Leader Election Code Violation in Bapatla District : రాష్ట్రంలో వైసీపీ నాయకులు యథేచ్చగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. తమకు ఎన్నికలు నిబంధనలు వర్తించవన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. బాపట్ల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా నందిగామ సురేష్, కోన రఘుపతి నామినేషన్లు వేసే క్రమంలో ఎన్నికల కోడ్ను ఉల్లఘించారు. వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
ఇవాళ వైసీపీ నాయకులైన నందిగామ సురేశ్, కోన రఘుపతి నామినేషన్ సందర్భంగా కొమ్మినేని రైస్ మిల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేపట్టారు. నామినేషన్ వేసే సమయంలో బాణసంచా కాల్చరాదని పోలీసులు నిబంధనలు విధించారు. కానీ పోలీసులకు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో కార్యకర్తలు బాణసంచా కాల్చరు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఆర్వో కార్యాలయానికి సమీపంలో పార్టీ శ్రేణుల నుంచి బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకులు నామినేషన్ ప్రక్రియలో భారీ ర్యాలీని నిర్వహించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.