ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలంటీర్లందరూ రాజీనామా చేయండి- వైఎస్సార్సీపీని గెలిపించండి: వైసీపీ నేత వీడియో వైరల్​ - YCP Leader Controversal Video Viral - YCP LEADER CONTROVERSAL VIDEO VIRAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 1:41 PM IST

YCP Leader Controversial Video is Viral: ఎన్నికల వేళ కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్​పై స్వామి భక్తిని చాటుకుంటున్నారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి వినియోగించుకోకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో విధులకు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలని పట్టుబడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వాలంటీర్లందరూ రాజీనామా చేయాలని తొండపాడు గ్రామ సర్పంచ్‌ భర్త మల్లం చంద్రమౌళి రెడ్డి వివాస్పద వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వాలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లకు 10 వేల రూపాయలు పారితోషకం ఇచ్చి వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.

రాజీనామాలు చేయని వారిని బెదిరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. చంద్రమౌళి వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వీడియోను అతనే తొలగించారు. ఇటీవల మచిలీపట్నంలో జనసేన అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. బాలశౌరి మీటింగ్​కు ఎవరెవరు వెళ్తున్నారో వారి పేర్లను నోట్ చేసుకోవాలని రాజీనామ చేసిన వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేత ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ప్రచారంలో ఉపయోగించుకోకూడదని వాళ్లని రాజీనామాలు చేయమని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details