ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సంక్షేమం, అభివృద్ధి చేయగలిగితేనే పరిపాలనకు సార్థకత : యనమల - Yanamala in Alliance Manifesto - YANAMALA IN ALLIANCE MANIFESTO

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 3:38 PM IST

Yanamala Ramakrishnudu Opinion on Alliance Manifesto: అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని తెలుగుదేశం సీనియర్‌ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. పన్నులు వేయకుండా వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వాములం కనుక నిధులు ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తామని యనమల తెలిపారు. డివల్యూషన్ ఫండ్స్ షేర్‌ను 50 శాతం చేయాలనే డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. 

ఐటీ, టూరిజం రంగాలను ప్రొత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని యనమల చెప్పారు. వైసీపీ పాలనలో జీఎస్‌డీపీ వృద్ధి తగ్గుతూ వచ్చిందని యనమల అన్నారు. రోడ్లకు మరమ్మతు చేయలేదు కానీ భవనాలకు మాత్రం రంగులు వేసుకున్నారని యనమల విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ చేయగలిగితేనే పాలనకు సార్థకత అని రామకృష్ణుడు అన్నారు. ఈ ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడితే తాము ఆదాయం పెంచడంపై దృష్టి సారిస్తామని యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details