ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్ ఆసరా సభలో కరవైన జనం- మంత్రి ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 10:50 AM IST

Womens Was Moving Out of YSR Asara Sabha: అధికార వైసీపీ సభలకు జనం నుంచి స్పందన రోజురోజుకు తగ్గిపోతుంది. బలవంతంగా తెచ్చిన జనం కూడా సమావేశం మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ అదే జరిగింది. మంత్రి ఉష శ్రీచరణ్‌ మాట్లాడుతుండగానే డ్వాక్రా సంఘాల మహిళలు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా కనేకల్‌లో జరిగిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలోనూ మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మహిళలు బయటికి వెళ్లిపోయారు. ఇదే కార్యక్రమంలో వైసీపీ వర్గ విభేదాలు భగ్గమన్నాయి. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. మెట్టు గోవింద్ రెడ్డి వర్గీయులే విద్యుత్ సరఫరా నిలిపివేశారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

గుంతకల్లులో మార్కెట్‌ రోడ్డులో నిర్వహించిన నాలుగో విడత ఆసరా కార్యక్రమం సభ జనం లేక బోసిపోయింది. మార్కెట్‌ ప్రధాన రోడ్డుపై సభ ఏర్పాటు చేయడంతో అటు వాహన చోదకులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సభకు పెనుకొండ, గుంతకల్లు ఎమ్మెల్యేలు, శంకరనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకే ఆసరా సభ వద్దకు మహిళలు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడకముందే సభకు వచ్చిన వారికి ఓపిక నశించి సభ నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు శంకరనారాయణ, వెంకటరామిరెడ్డి మాట్లాడుతుండగానే వెనుక కూర్చున్న మహిళలు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. మహిళల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తూ ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని శంకరనారాయణ, వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వీధి దారుల్లో ప్లెక్సీలను అడ్డంగా కట్టడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details