ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

"డిప్యూటీ డీఎంహెచ్​ఓ పెళ్లి చేసుకుని మోసం చేశారు"- కలెక్టరేట్ ఎదుట మహిళ నిరసన - Woman Protest against Deputy DMHO - WOMAN PROTEST AGAINST DEPUTY DMHO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 7:32 PM IST

Woman Protests that Deputy DMHO Married and Cheated: అన్నమయ్య జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​ఓ చెన్న కృష్ణ పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. చెన్నకృష్ణకు గతంలో పెళ్లయిందని కానీ పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి తనను రెండో వివాహం చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లపాటు కాపురం చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని బాధితురాలు విలపించారు. ఈ క్రమంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ కడప కలెక్టరేట్ ఎదుట ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

కడపలోని సర్వజన ఆస్పత్రిలో స్టాఫ్​నర్స్​గా పని చేస్తున్న చిన్నమ్మకు పదేళ్ల కిందట డిప్యూటీ డీఎంహెచ్​ఓగా పనిచేస్తున్న చెన్నకృష్ణ పరిచయమయ్యాడు. చెన్న కృష్ణ తనకు వివాహం కాలేదని చెప్పి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెన్న కృష్ణ భార్యగా స్వీకరించాలని లేదంటే ఆత్మహత్యకు పాల్పడతానని తెలిపారు. చిన్నమ్మకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details