ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహిళ హత్య - డబ్బు కోసం ఘాతుకానికి పాల్పడినట్లు భర్త అనుమానం - Woman Murder in Eluru District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 4:32 PM IST

Woman Murder in Eluru District: ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని కొత్తరామయ్యపేటలో మేడూరి దుర్గ (38) అనే మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి దుర్గ భర్త ఇంటికి వెళ్లే సరికి ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు (Unknown Persons) ఆమె మెడ కోసి చంపినట్లు (Murder) భర్త ముత్యాల రావు పోలీసులకు సమాచారం అందించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మొక్కజొన్న చేలలో పనులు చేసేందుకు కూలీలను సరఫరా చేసే బంటా మేస్త్రిగా దుర్గ పని చేస్తోంది. బుట్టాయగూడెం మండలానికి సుమారు 70 మంది కూలీలను చాలా కాలం నుంచి పనికి తీసుకెళ్తోంది. రైతులు కూలీల కోసం ఇచ్చిన నగదు ఈమె వద్ద ఉంది. దుర్గ హత్యకు గురవటం, బీరువాలో ఉండాల్సిన నగదు మాయం అవటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బుల సంగతి తెలిసిన వ్యక్తులే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details