హిందూపురంలో దారుణం - మహిళ చేతులు, కాళ్లు కట్టేసి హత్య - Woman Murdered - WOMAN MURDERED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 12:13 PM IST
Woman Brutally Murdered in Hindupuram : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హిందూపురం మండలం మలుగూరు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజులాగానే సోమవారం కూడా గొర్రెలు మేపేందుకు గ్రామ పొలిమేరకు వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరికి జయమ్మ గ్రామ పొలిమేరలో విగత జీవిగా కనిపించింది.
జయమ్మ చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం 25 గొర్రెలను ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గొర్రెలను తీసుకు వెళ్లడానికే జయమ్మను హత్య చేసి ఉంటారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తొందరలోనే తెలియజేస్తామని పోలీసులు పేర్కొన్నారు.