ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య - ఆపై తానూ ఆత్మహత్యాయత్నం - crime news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 11:36 AM IST

Wife Pours Hot Oil on Husband: అనుమానం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. భర్తపై అనుమానంతో భార్య క్షణికావేశంలో వేడి నూనెను పోసింది. అలానే తన కుమార్తెకు బలవంతంగా నిద్రమాత్రలు మింగించింది. ఆపై ఆమె కూడా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

బెల్లంమండి వీధికి చెందిన మహేష్ సెల్ ఫోన్ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. మహేష్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని కొంత కాలంగా భార్య జ్యోతికి అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మహేష్‌ నిద్రపోతుండగా క్షణికావేశంలో అతడిపై వేడి నూనె పోసింది. ఆ వెంటనే కుమార్తె లక్ష్మిచందనకు బలవంతంగా నిద్రమాత్రలు మింగించి, తానూ మాత్రలు మింగింది. స్థానికులు వెంటనే ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మహేష్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురూ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details