తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరంగల్​లో రూ.64 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత - ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్ - ganja smugling in warangal - GANJA SMUGLING IN WARANGAL

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 8:07 PM IST

Police Caught Ganja in Warangal : వరంగల్​లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.64 లక్షల విలువ చేసే 256 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, మూడు చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిలో భూపాలపల్లికి చెందిన కుమారస్వామిని నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. 

మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. వరంగల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక దృష్టి సారించామని సీపీ పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు జలంధర్, ముకుందలను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై ఇదివరకే కేసులు ఉన్నాయని సీపీ అంబర్​ కిశోర్​ పేర్కొన్నారు. గంజాయిని గుర్తించి నిందితులను పట్టుకున్న అధికారులను సీపీ అభినందించారు 

ABOUT THE AUTHOR

...view details