ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ అభ్యర్థికి షాక్‌ - లోకేశ్​కే ఓటు వేస్తామన్న మంగళగిరి ఓటర్లు - Shock to Mangalagiri YCP Candidate - SHOCK TO MANGALAGIRI YCP CANDIDATE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 1:23 PM IST

Voters Shock to Mangalagiri YSRCP Candidate: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలకు ప్రజలు షాక్​లు ఇస్తున్నారు. వైసీపీకి ఓటు వేసేదే లేదంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరికొంతమంది అయితే అభ్యర్థులకే  తేల్చి చెప్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మంగళగిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రచారం నిర్వహిస్తూ ఓటు అభ్యర్థించిన లావణ్యకు తాము లోకేశ్​కే ఓటు వేస్తామని సమాధానం ఇచ్చారు. లోకేశ్ ద్వారానే తమకు లబ్ది జరిగిందని మహిళలు లావణ్యకు స్పష్టం చేశారు. 

మరోవైపు మంగళగిరిలో నారా లోకేశ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత అయిదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టారు. మహిళల స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టుమిషన్లు ఇచ్చారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. 29 సంక్షేమ పథకాలను అయిదు సంవత్సరాలుగా సొంత నిధులతో అమలు చేస్తున్నారు. అనేక మందికి తోపుడుబండ్లు ఇచ్చారు. దీంతో మంగళగిరి ప్రజలు నారా లోకేశ్​కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అభ్యర్థులు ప్రచారానికి వచ్చినా కూడా నిర్మొహమాటంగా లోకేశ్​కి ఓటు వేస్తామంటూ ఓటర్లు చెప్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details