అధికారులపై వైసీపీ నాయకుల ఒత్తిళ్లు - ఓటరు తుది జాబితాలో తవ్వేకొద్దీ తప్పులు - Anantapur District Voter List
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 1:04 PM IST
Voter List Errors in Anantapur District : ఇంటింటికీ తిరిగి ఓట్ల జాబితాను సిద్ధం చేశామని చెప్పిన అధికారులు తప్పులను మాత్రం సరిదిద్దలేదు. ఓటరు తుది జాబితాలో తవ్వేకొద్దీ తప్పులు దర్శనమిస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే అనంతపురం జిల్లా విడపనకల్లులోని జాబితా. పెద్ద కొట్టాలపల్లిలోని 15వ పోలింగ్ కేంద్రంలో 856 మంది ఓటర్లు ఉన్నారు. వరుస సంఖ్య 506లో వి.సరోజ, 531లో వి.నాగిరెడ్డి, 527లో వి.నీరజ, 541లో వి.శిరీష పేరుతో ఓట్లు ఉన్నాయి. వీరిలో ఇద్దరు పెళ్లిళ్లు అయ్యి ఐదేళ్ల కిందటే గ్రామం నుంచి వెళ్లిపోయారు. మరో ఇద్దరు గ్రామంలో శాశ్వతంగా లేరు. కానీ వీరికి ఓట్లు ఉన్నాయి.
Negligence of the Officials in Preparing Voter List : 24వ పోలింగ్ కేంద్రంలో వరుస సంఖ్య 441లో నాగరాజు, 433లో అనిత రాణి పేరుతో ఓట్లు ఉన్నాయి. వీరు కర్ణాటకకు చెందిన వారు అయినప్పటికీ వారికి ఓటు జాబితాలో చోటు కల్పించారు. స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్భలంతోనే బీఎల్ఓలు వారిని ఓటర్లుగా కొనసాగిస్తున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.