ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషి - హిజ్రాలకు అవగాహన కార్యక్రమం - vote awareness program

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 8:17 PM IST

Published : Mar 22, 2024, 8:17 PM IST

Vote Awareness Program for Transgender : ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మెుదలైంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తాజాగా ఓటు హక్కు వినియోగంపై హిజ్రాలకు అవగాహన కల్పించారు అనంతపురం జిల్లా అధికారులు. జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాణి సుస్మిత, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఓటు ప్రాముఖ్యత గురించి ట్రాన్స్ జెండర్స్​కు వివరంగా చెప్పారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు సార్వత్రిక ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈవీఎంలను ఎలా వాడాలి అంశంపై హిజ్రాలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఓటును నిబద్ధత, నిజాయితీతో ఉపయోగించుకోవాలని కోరారు. అదేవిధంగా హిజ్రాలు వారికున్న సమస్యల గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆమె సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details