ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వర్షాకాలం వచ్చింది- వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది! - Villagers Search of Diamonds

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 5:38 PM IST

Villagers Search of Diamonds at Vajrakarur: వర్షాకాలం వచ్చిందంటే అన్నదాతలు ఆకాశం వైపు చూస్తారు. అయితే ఆ ప్రాంతంలో మాత్రంలో వరుణుడి రాక కోసం వ్యవసాయేతరులు కూడా ప్రార్థిస్తారు. వర్షం పడిందంటే వేట మొదలు పెడతారు. అదీ కూడా వజ్రాల వేట. వర్షాకాలం వచ్చిందంటే చాలు అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఈ వజ్రాల వేట మొదలవుతుంది. జిల్లా నలుమూలల నుంచి చిన్నా పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు వజ్రాల అన్వేషణ కోసం తరలివస్తున్నారు. 

పంట పొలాలన్నీ వజ్రాలు వేతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న వజ్రానికి లక్షలలో నగదు లభిస్తుండటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో వచ్చి వెతుకుతూ ఉంటారు. మదనపల్లి, కడప, ధర్మవరం, ఆలూరు, చిప్పగిరి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే వజ్రాలను వెతకడానికి వచ్చిన వారు తమ పొలాలను తొక్కెస్తున్నారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details