ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాగులో కొట్టుకుపోయిన యువకులు - రక్షించిన గ్రామస్థులు - Villagers Rescued Two Youngsters

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 10:35 PM IST

Villagers Rescued Two Youngsters : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లామ్‌ వాగులో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. వారిని గమనించిన గ్రామస్థులు చాకచక్యంగా స్పందించి, తాళ్ల సాయంతో ఇద్దరిని రక్షించారు. చెట్టు కొమ్మను పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్న మరో యువకుడిని కాపాడేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

గుంటూరులోని కలెక్టర్ కార్యాలయ రహదారి, 3 వంతెనల మార్గం, చుట్టుగుంట మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, శివారెడ్డిపాలెం పరిసరాల్లో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మంగళగిరిలోని గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందింది. ఆమె ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పడిన రాయి పడటంతో నాగరత్నమ్మ అక్కడికక్కడే చనిపోయింది.

ABOUT THE AUTHOR

...view details