ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాగులో మృతదేహాన్ని మోసుకెళ్లిన గ్రామస్థులు - అసలేం జరిగిందంటే? - Paderu Bridge problem in Ap - PADERU BRIDGE PROBLEM IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 3:44 PM IST

Bridge Problem in Paderu: అల్లూరి జిల్లా పాడేరు మండలం దేవాపుర పంచాయతీ పరిధిలో వంతెన లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. తాజాగా వంతెన లేక వాగులోనే మృతదేహాన్ని మోసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. తుమ్మలపాలెంలో నివాసం ఉండే గాదే నాగరాజు (32) అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. కేజీహెచ్​లో చికిత్స తీసుకుంటూ మరణించారు. దీంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలిస్తుండగా వంతెన లేక అంబులెన్స్​ వాగు వద్దే ఆగింది. అందువలన గ్రామస్థులందరూ కలిసి ఎంతో శ్రమతో మృతదేహాన్ని అతికష్టం మీద వాగు దాటించి స్వగ్రామానికి తీసుకెళ్లారు.

పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు: వంతెన కోసం ఎన్నోసార్లు స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశామని తుమ్మలపాలెం, మునగల పాలెం, అర్జాపురం గ్రామస్థులు తెలిపారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి వెళ్లడం తప్ప సమస్యను పరిష్కరించ లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామాలకు రోడ్డు మరియు వంతెన సౌకర్యాలు  కల్పించాల్సిందిగా గ్రామస్థులందరూ కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details