అపోహలు నమ్మొద్దు - 144 సెక్షన్ అమలులో ఉంది: విజయవాడ సీపీ - Vijayawada CP PhD Ramakrishna - VIJAYAWADA CP PHD RAMAKRISHNA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 5:42 PM IST
Vijayawada CP Ramakrishna: సోషల్ మీడియాపై మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ పీహెచ్‌డి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ ఐపీసీ 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నాయన్నారు. బాటిల్స్‌లో పెట్రోల్ అమ్మకాలు నిషేధించాలని పెట్రోలు బంకుల యజమానులకు ఆదేశించినట్లు సీపీ తెలిపారు. కౌంటింగ్ జరిగేలోపు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. బాణసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తామన్నారు.
సామాజిక మాథ్యమాల్లో వస్తున్న వార్తలపై అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు చేయొద్దు, అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్, డ్రోన్ లు ఎగురవేసినా, అతిక్రమించినా చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింప చేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు.
స్ట్రాంగ్ రూం వద్ద రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీ తో మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు.ఫేషియల్ రికగ్నిజేషన్ పరిజ్ఞానంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వారికే స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు. డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు సీపీ రామకృష్ణ తెలిపారు.