జగన్ పాలనలో అకారణంగా హింసించి జైల్లో పెట్టారు: బాధితుడు - Allegations on YSRCP - ALLEGATIONS ON YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 1:40 PM IST
Victim Reddy Gowtham Allegations on YSRCP: జగన్ పాలనలో తనను, తన భార్యను అక్రమంగా అకారణంగా హింసించి అక్రమ కేసులతో జైల్లో పెట్టించారని మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు, వ్యాపారవేత్త రెడ్డి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఓ ఫిర్యాదుతో కేసులు పెట్టారని ఆరోపించారు. తనను, తన భార్యని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరారు.
"గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాపై, నా భార్యపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. ఎలాంటి ఆధారాల్లేని ఓ ఫిర్యాదుతో మాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను పెట్టిన కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నడుస్తోంది. తన ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి, ఇప్పుడు రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి వైఎస్ జగన్ మాట్లాడటం దారుణం. కారకులపై చర్యలు తీసుకుని మా సమస్యను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను." - రెడ్డి గౌతమ్, బాధితుడు