ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎన్నికలు పూర్తై 3 నెలలవుతున్నా బకాయిలు చెల్లించలేదు' - వాహన యజమానుల ధర్నా - Vehicle Owners Agitation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 6:59 PM IST

Vehicle Owners Agitation for Pending Bills (ETV Bharat)

Vehicle Owners Agitation for Pending Bills: అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌ వద్ద అద్దె వాహన యజమానులు ధర్నాకు దిగారు.  2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారులు, సిబ్బంది ప్రయాణించేందుకు ఇచ్చిన వాహనాలకు మూడు నెలలుగా అద్దె డబ్బులు చెల్లించలేదని అద్దె వాహనం యజమానులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఎన్నికలు పూర్తై మూడు నెలలు అవుతున్నా అధికారుల చుట్టూ తిరిగినా తమకు రావాల్సిన అద్దె బిల్లులు ఇవ్వడం లేదని యజమానులు వాపోయారు.

జిల్లాలో సుమారుగా 50 లక్షల రూపాయలకు పైగా బిల్లులు బకాయిలు రావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుచేసి మరీ వాహనాలకు డీజిల్ ఖర్చులు భరించి నడిపామని, ఎన్నికలు ముగిసినా అధికారులు తమకు రావాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. వాహనదారుల ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతు పలికారు. ప్రైవేట్ వాహనదారులకు ప్రభుత్వం వెంటనే అద్దె బిల్లులు చెల్లించాలని సీపీఐ నేత ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నో అవస్థలు పడుతున్న వాహనదారులకు బిల్లులు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details