ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రెడ్డి సామాజికవర్గానికే నామినేటెడ్ పదవులా? - వైసీపీకి బుద్ధి చెప్పేందుకు వాల్మీకులు సిద్ధం - YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 2:01 PM IST

Valmiki Seva Samithi Fires on YSRCP: నామినేటెడ్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని వాల్మీకి సేవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాల్మీకులకు చెందిన దేవాలయానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎలా ఛైర్మన్​గా నియమిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా బీసీ, నా ఎస్సీ అని చెప్పడం వరకే గాని పదవులు మాత్రం రెడ్లకే ఇస్తున్నారని విమర్శించారు.

కాగా కర్నూలులోని వెంకయ్యపల్లె ఎల్లమ్మ దేవాలయం ఛైర్మన్​గా బేతం కృష్ణుడుకు రెండోసారి అవకాశం కల్పించకపోవడంతో ఆయన కోడుమూరు వైసీపీ ఇన్​ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్​గా వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనకు ఎందుకు రెండోసారి అవకాశం కల్పంచలేదని ధ్వజమెత్తారు. రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వారందరిని రెండోసారి ఛైర్మైన్​గా కొనసాగించినప్పుడు దేవాలయాన్ని అభివృద్ధి చేసిన తనను ఎందుకు తప్పించారని నిలదీశారు. జిల్లాలో వాల్మీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వాల్మీకులు అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details