ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'అన్నదాత' ద్వారా రామోజీరావు రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారు: వడ్డే శోభనాద్రీశ్వర రావు - Vadde Shobhanadri About Ramoji Rao - VADDE SHOBHANADRI ABOUT RAMOJI RAO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 6:09 PM IST

Vadde Sobhanadreeswara Rao and Farmer Union Leaders Tribute to Ramoji Rao : పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగంగా అందించడంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కీలక పాత్ర పోషించారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. అన్నదాత పత్రిక ద్వారా రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారన్నారు.  విజయవాడలో నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో రామోజీరావు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ చిత్రపటాలకు రైతు సంఘాల నాయకులు నివాళులర్పించారు. 

వారిరువురి మరణం దేశ, రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. జులైలో దిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రైతు సమస్యలపై గొంతెత్తుతామన్నారు. సమావేశంలో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు వంటి ఇతర సమస్యలను చర్చించి, సమస్యల పరిష్కారానికై తీసుకోవలసిన చర్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details