LIVE : నిజామాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ - BJP MEETING IN NIZAMABAD LIVE - BJP MEETING IN NIZAMABAD LIVE
Published : Apr 25, 2024, 1:09 PM IST
|Updated : Apr 25, 2024, 1:54 PM IST
BJP Election Campaign : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తున్న వేళ కమలం పార్టీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేసింది. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ అధిష్ఠానం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దింపింది. సదరు నేతలు తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, రోడుషోలు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో ఇవాళ భాగంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురీ అర్వింద్ తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇవాళ నిజామాబాద్‌లో పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజీరెడ్డి గోవర్ధన్‌రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
Last Updated : Apr 25, 2024, 1:54 PM IST