తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ముచ్చింతల్‌ స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఉగాది సంబురాలు - Ugadi Celebrations LIVE - UGADI CELEBRATIONS LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 9:52 AM IST

Updated : Apr 9, 2024, 10:49 AM IST

Ugadi Celebrations In Swarna Bharat Trust : తెలుగు ప్రజలందరికీ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయం చాలా గొప్పవని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్​లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ హాజరయ్యారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు. ప్రముఖ జ్యోతిష్య పండితుడు చిర్రావూరి విజయానంతశర్మ పంచాంగ పఠనం చేశారు. ఉగాది ప్రాశస్త్యం గురించి సుప్రసిద్ధ ప్రవచన కర్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి వివరించారు.సుఖాలకు పొంగకు, దు:ఖానికి కుంగకు, సుఖదు:ఖాలని సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి అని పండితులు తెలిపారు. ఎన్నో ఔషధగుణాలున్నపై షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని తెలిపారు.
Last Updated : Apr 9, 2024, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details