ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం మత్తులో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టి ఇద్దరు మృతి - Two Were Died In Road Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 6:26 PM IST

Two Were Died In Rajampet Road Accident: మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తున్న లారీని ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కడప చెన్నై ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. మృతులు నందలూరు  మండలం ఆడపూరు గ్రామానికి చెందిన పెంచలయ్య (25), ఈశ్వరయ్య (28)గా గుర్తించారు. పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరిని మృత్యువు కబళించటంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Beggar Died Due To Careless Driving: విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలి సమీపంలో జయభేరీ షోరూం వద్ద కారు బీభత్సం సృష్టించింది. నిర్లక్ష్యంతో అతివేగంగా డ్రైవింగ్ చేయటంతో పుట్​పాత్ పైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఫుట్​పాత్​పై ఉన్న యచకురాలు అక్కడికక్కక్కడే మృతి చెందింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details