ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్నాడు జిల్లాలో పిడుగుపాటు- ఇద్దరు గొర్రెల కాపరులు మృతి - Two Die lightning Strikes

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 2:55 PM IST

పల్నాడు జిల్లాలో పిడుగుపాటు- ఇద్దరు గొర్రెల కాపరులు మృతి (ETV Bharat)

Two Die lightning Strikes in Palnadu district: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు సంతమాగలూరుకు చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే పిడుగు పడడంతో ఇద్దరు కాపరులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతులను గ్రామాలకు తరలించారు. ఒకేసారి ఇద్దరు విగతజీవులుగా పడి ఉండటం చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Shepherd Dead Due to Thundershowers Strikes: అకాల వర్షలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షాలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలుల వీస్తాయని ఏదైనా సమస్య ఉంటే  సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details