తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్నేహమంటే ఇదేరా - స్కేల్​తో పరిచయమైన ఫ్రెండ్​షిప్ - 65 ఏళ్లుగా పదిలం - FRIENDSHIP DAY CELEBRATIONS 2024 - FRIENDSHIP DAY CELEBRATIONS 2024

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 2:04 PM IST

FRIENDSHIP DAY CELEBRATIONS 2024 : సృష్టిలో మధురమైనది స్నేహం. త్యాగానికి ప్రతిరూపం స్నేహం. ఎల్లలు, అవధులు, పరిమితులు లేనిదే స్నేహమంటున్నారు ఈ బాల్యమిత్రులు. చదువుకునే వయసు నుంచి సాగుతున్న స్నేహం వీరిది. నాలుగో తరగతిలో స్కేల్​తో పరిచయమైన ఫ్రెండ్​షిప్ ఇప్పటికీ పదిలంగా కొనసాగుతోంది. బలమైన బాల్యమిత్రుల స్నేహం, వీరి కుటుంబాలను ఒక్కటి చేసి బంధువులుగా మార్చింది. 

జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన మద్దిలపల్లి ముత్యాలు, బత్తుల రాజగంగారం తమ చదువుకునే రోజుల నుంచి మిత్రులు. ఇద్దరూ కలిసే చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటమే కాకుండా, ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బాల్యమిత్రులుగా ప్రారంభమైన వారి స్నేహం, నేటికి 65 ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరలేదు. ఆ దోస్తీ వారి కుటుంబాలను ఒక్కటి చేసి, బంధువులుగా మార్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తాము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని స్నేహబంధం గురించి గొప్పగా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details