ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు ఒకేసారి ఐదు దస్త్రాలపై సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం : కాంగ్రెస్ నేత తులసిరెడ్డి - Tulasi Reddy comments on CBN - TULASI REDDY COMMENTS ON CBN

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 5:16 PM IST

Tulasi Reddy Welcomed the Signing of Five Schemes by CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి ఐదు దస్త్రాలపై సంతకాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారని రాష్ట్రంలో మిగిలిన 2 లక్షల 30 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 4 వేల రూపాయల పింఛను పెంచుతుండటం శుభ పరిణామమే అన్నారు. అధేవిధంగా 19 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తానని మ్యానిఫెస్టోలో పెట్టిన మాట మరవకూడదన్నారు.

కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే రాష్ట్ర మంత్రివర్గంలో కడపజిల్లాకు అన్యాయం జరిగిందనన్నారు. గత ఐదేళ్లలో కడపజిల్లా నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తే తెలుగుదేశం నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హత లేదా అని ప్రశ్నించారు?

ABOUT THE AUTHOR

...view details