ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్టోబర్​ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు - అధికారులతో ఈవో సమీక్ష - Tirumala Salakatla Brahmotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 9:54 PM IST

TTD EO Shyamala Rao Review (ETV Bharat)

TTD EO Shyamala Rao Review With Brahmotsavam Arrangements : తిరుమల శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రాబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. గరుడ సేవ రోజున భక్తుల రద్దీ రీత్యా అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. వాహన సేవలు చూసేందుకు భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Tirumala Salakatla Brahmotsavam 2024 Schedule : అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ ఉంటుంది. 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్ర స్నానంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు ఏడు లక్షల లడ్డూలను భక్తుల సౌకర్యార్థం అందుబాటలో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భద్రత ఏర్పాట్లు చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details