ETV Bharat / state

కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయి- ఎవరినీ వదిలిపెట్టం: నారా లోకేశ్ - Nara Lokesh on TTD Ghee Issue - NARA LOKESH ON TTD GHEE ISSUE

Minister Nara Lokesh on TTD Ghee Issue: వైఎస్సార్సీపీ హయాంలో భక్తులను దేవుడికి దూరం చేశారని,మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారని, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు.

Minister Nara Lokesh on TTD Ghee Issue
Minister Nara Lokesh on TTD Ghee Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 9:24 PM IST

Updated : Sep 19, 2024, 10:55 PM IST

Minister Nara Lokesh on TTD Ghee Issue: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా వ్యవహరించారని, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాల తయారీలో శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని అన్నారు. జంతువుల కొవ్వుతో తయారైన నూనె వాడటం అత్యంత బాధాకరమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన లోకేశ్​కు రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. 2 రోజులపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ పర్యటించనున్నారు. విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు.

తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - ల్యాబ్‌ రిపోర్ట్‌లో భయంకర నిజాలు - TTD GHEE ISSUE FACTS

అన్నదానం, లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని విమర్శించారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనడానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. గతంలో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న ల్యాబ్​ పంపి పరీక్షించామని, జంతువుల కొవ్వుతో తయారుచేసిన నూనె ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెంచామన్నారు. జగన్‌ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్న మంత్రి లోకేశ్, కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమన్నారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని, దమ్ముంటే కల్తీనెయ్యి అంశంపై తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

గతంలో పింక్‌ డైమండ్‌ దొంగిలించారని ఆరోపణలు చేశారన్న లోకేశ్, ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఏమీ నిరూపించలేదన్నారు. గత పాలకులకు దేవుడిపై నమ్మకం లేదని, కేఎంఎఫ్‌ను (Karnataka Milk Federation) కాదని ఇతరులకు టెండర్‌ ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఎవరినీ వదిలిపెట్టమని, విజిలెన్స్ విచారణ చేస్తున్నామన్నారు. ప్రమేయం ఉన్నవారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని, దేవుడి జోలికి ఎవరు వెళ్లినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

"వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టంగా చెప్పాం. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. నాణ్యత పరీక్షల కోసం నెయ్యిని పంపాం. కల్తీనెయ్యి అంశంపై నివేదికలో ఆధారాలు లభించిన తర్వాత కూడా ఇంకా ఇష్టారీతిన మాట్లాడుతామంటే ఊరుకోము. కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి అంశంపై తిరుమలలో ప్రమాణానికి నేను సిద్ధం. వైవీ సుబ్బారెడ్డి సిద్ధమా?". - నారా లోకేశ్, మంత్రి

వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE

Last Updated : Sep 19, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.