సైకిల్ తొక్కుతూ.. రోడ్లు ఊడుస్తూ.. స్వచ్ఛతపై గుంటూరు కమిషనర్​ - Swachhata Hi Seva Campaign 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

thumbnail
గుంటూరులో స్వచ్చతాహీ సేవా-సైకిల్​పై నగరంలో పర్యటించిన కమిషనర్​ (ETV Bharat)

Swachhata Hi Seva Campaign 2024 in Guntur : గుంటూరు నగరాన్ని స్వచ్ఛతలో ముందంజులో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ఆయన సైకిల్​పై నగరంలో పర్యటించారు. ఇక నుంచి ప్రతి గురువారం సైకిల్ పైనే విధులకు హాజరవుతానని ఆయన తెలిపారు. అంతకు ముందు హిమని సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నిర్వహించే పనులను సకాలంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

జీఎంసీ అధికారులంతా ఈ రోజు మొత్తం సైకిల్​పై తిరుగుతూ వీధులు శుభ్రం చేశామని శ్రీనివాసులు తెలిపారు. ప్రజలందరికిీ దీని గురించి ముందే పిలుపునిచ్చామన్నారు. అందరూ సహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరుకున్నారు. అక్టోబర్​ 1 వరకు అదే తరహాలో వీధులు శుభ్రం చేస్తామని తెలిపారు. గుంటురులో ప్రతీ వీధి స్వచ్చంగా ఉంచటమే తమ ధ్యేయమని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.