తెలంగాణ

telangana

ETV Bharat / videos

తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించా : ఐపీఎస్ మౌనిక - Trainee IPS Mounika Special Story

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:11 PM IST

Trainee IPS Mounika Interview : తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించి సత్తా చాటింది ఆ గిరిజన బిడ్డ. తండ్రి లక్ష్యమే తన స్వప్నమని భావించి జర్మనీలో పీహెచ్​డీ విద్యను పూర్తి చేసుకుని, స్వదేశంలో అడుగు పెట్టి సివిల్స్ ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఐదోసారి సివిల్స్ ర్యాంకు సాధించి ఐపీఎస్​గా ఎంపికైంది.

Trainee IPS Mounika Special Story : కుంగుబాట్లు, మానసిక వేదనకు తానే సమాధానం చెప్పుకుని ముందడుగు వేసి పేరు పక్కన ఐపీఎస్ అని పిలిపించుకుంటోంది. భవిష్యత్తులో మంచి పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా పని చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా పోలీసింగ్ నిర్వహించడమే తన లక్ష్యమంటోంది. యువత తమకు నచ్చిన రంగంలో కృషి చేస్తే తప్పకుండా విజయాలు సాధిస్తారని అంటోంది. మహిళా భద్రత, మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని చెబుతున్న యువ ఐపీఎస్, గిరిజన బిడ్డ పోరిక మౌనిక ఈటీవీతో తన అంతరంగాన్ని పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details