ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం మత్తులో మందుబాబుల వీరంగం - కత్తి దాడిలో ఒకరు మృతి, బస్సు స్టీరింగ్ తిప్పిన మరో తాగుబోతు - Drunk mans Tragedy in Anantapur - DRUNK MANS TRAGEDY IN ANANTAPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 9:55 AM IST

Tragedy Strikes During Ganesh Immersion in Anantapur : అనంతపురం పట్టణంలో గణేష్ నిమజ్జనం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు తాగుబోతుల మధ్య  చెలరేగిన గొడవ ఒక యువకుడి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే, నిమజ్జనం సమయంలో నవోదయ కాలనీకి చెందిన శ్రీధర్ అదే కాలనీకి చెందిన తేజ అనే వ్యక్తులు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఇరువురు మద్యం మత్తులో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొని చివరికి తేజ అనే వ్యక్తి శ్రీధర్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీధర్​ని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తేజ పరారీలో ఉన్నాడు. 

మరో ఘటనలో జిల్లాలోని గుత్తి శివారులో జాతీయ రహదారిపై ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. గుత్తి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నిలపలేదని రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే బస్సు నిలిపిన డ్రైవర్ అతనిని బస్సులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా బస్సు స్టీరింగ్ తిప్పటంతో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన రామిరెడ్డిని బస్సు డ్రైవర్, ప్రయాణికులు గుత్తి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.

ABOUT THE AUTHOR

...view details