ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హంసలదీవి బీచ్‌లో విషాదం - ఒకరు మృతి, మరొకరు గల్లంతు - Tragedy at Hamsala Deevi Beach - TRAGEDY AT HAMSALA DEEVI BEACH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 6:13 PM IST

Tragedy at Hamsala Deevi Beach in Krishna District: కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. అలల దాటికి ఒకరు గల్లంతుకాగా పాషా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మెరైన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గుడివాడకు చెందిన ఆరుగురు హంసలదీవి బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేసేందుకు సముద్రంలో దిగగా అలల దాటికి కొట్టుకు పోయారు. వారి అరుపులు విని దగ్గర్లోని ఓ ఆటో డ్రైవర్‌, మెరైన్‌ పోలీసులు ఐదుగురిని రక్షించారు. ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. రక్షించిన వారిలో పాషా అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తి కోసం మెరైన్‌ పోలీసులు గాలిస్తున్నారు. హంసలదీవిలో పర్యాటకుల ప్రమాద ఘటన పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతయిన వ్యక్తి కోసం మెరైన్‌ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, ప్రాణాలతో బయటపడిన వారికి పోలీస్‌, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details