ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏపీలో మరో 'ఊటీ' - చేతికందుతూ ఓలలాడించే మేఘాలు - THE BEAUTY OF THE HILLS IN PADERU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 1:08 PM IST

Tourist Center Vanjangi: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వంజంగి కొండల్లో పర్యాటకులు సందడి చేశారు. పొగలు చిమ్మే తేలియాడే మేఘాల సమూహంలో సూర్యోదయం తిలకించి తన్మయానికి లోనయ్యారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రకృతి అందాలను సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. పచ్చని కొండల నడుమ కనువిందు చేస్తున్న పొగ మంచులో పర్యాటకులు ఉత్సాహంగా గడిపారు. 

Snowfall at Vanjangi Attracting Visitors with Beautiful Nature : ఘాట్ రోడ్​లో ప్రయాణిస్తూ ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ అలా కొద్ది సేపు ఆ కొండల్లో ప్రకృతి ప్రేమికులు సేద తీరుతూ గాలిలో తెేలుతున్నారు. అటు వైపుగా వెళ్లినవారు తమ సెల్ ఫోన్లో ప్రకృతి అందాలను బంధించకుండా ఉండలేక పోతున్నారు. ఇది చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలకు వంజంగి కొండలు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్నాయని, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details