రహదారి భద్రత మనందరి బాధ్యత - రోడ్డు ప్రమాదాలను నివారించడం ఎలా?
Published : Jan 25, 2024, 9:07 AM IST
Prathidwani Debate on Road Safety : నేడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొస్తున్నారా, అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. రహదారులపై పెరుగుతోన్న ప్రమాదాలు. తప్పెవరిదైనా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాల్లో ఇంటికి పెద్దను కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలెన్నో. రోజురోజుకీ ఆందోళన కలిగిస్తున్న ఈ రహదారి ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. అతివేగం, దూకుడు, మద్యం, మత్తుపదార్థాల ప్రభావం వీటన్నింటికీ మించి బెంబేలెత్తిస్తోన్నది మైనర్ల డ్రైవింగ్. దీనిపై కఠిన నిబంధనలు తెచ్చినా సమస్య అలానే ఉంది? వీరి కట్టడి ఎలా? దేశవ్యాప్తంగా చూస్తే ఒక్క 2022లోనే 1.68 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అసలు ఈ మరణాల సంఖ్య ఏటికేటా పెరుగుతూనే ఉండడానికి కారణమేంటి? మరి ప్రమాదాలను తగ్గించడానికి మార్గాలేలేవా? ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.