LIVE: తిరుమలలో రథసప్తమి వేడుకలు, చక్రస్నానం - ప్రత్యక్షప్రసారం - Srivari Hanumantha Vahana Seva Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 12:55 PM IST
|Updated : Feb 16, 2024, 2:41 PM IST
Tirumala Srivari Hanumantha Vahana Seva Live: తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వాహన సేవలు.. కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వాహన మండపం నుంచి వాయవ్యం దిశకు స్వామి చేరుకున్నారు. భానుడి కిరణాలు స్వామి పాదాలకు తాకిన తర్వాత అర్చకులు హారతులు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ప్రారంభించారు.
సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడు దర్శనమివ్వగా.. అనంతరం చినశేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో తేలియాడారు. ప్రస్తుతం హనుమంత వాహనంపై తిరుపతి మాఢవీధుల్లో ఊరేగుతున్న వెంకటేశ్వరుడు.. అనంతరం మలయప్పస్వామి అవతారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ తర్వాత సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించి.. చివరగా చంద్రప్రభ వాహనంపై పయనించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవలు చివరగా చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి హనుమంత వాహన సేవ ప్రత్యక్షప్రసారం మీకోసం.